భారతదేశం, మే 30 -- 2018 జూన్ 29.. థియేటర్లలోకి ఒక చిన్న సినిమా వచ్చింది. పెద్దగా స్టార్ కాస్టింగ్ లేదు, కమర్షియల్ హంగులు లేవు, అప్పటివరకు ఇండస్ట్రీ చూసిన ఏ పాత ఫార్ములాకూ అది సరిపోలేదు. కానీ, ఈరోజు.. అంటే 2026లో కూడా.. టాలీవుడ్‌లో బెస్ట్ 'ఫ్రెండ్‌షిప్' మూవీ ఏది? అని ఎవరిని అడిగినా.. క్షణం ఆలోచించకుండా చెప్పే పేరు: "ఈ నగరానికి ఏమైంది" (ఈఎన్​ఈ).

నేను ఈ సినిమాకి పెద్ద ఫ్యాన్! ఫ్యాన్ అనడం కంటే.. ఈ మూవీ నా లైఫ్​లో ఒక భాగమైపోయింది అనడం కరెక్ట్. సంతోషం వచ్చినా, బాధొచ్చినా, సక్సెస్​ వచ్చినా, ఫెయిల్​ అయినా.. సందర్భం ఏదైనా, సమయం ఏదైనా, చూసే సినిమా ఈ ఈఎన్​ఈ. (ఆ సినిమా ఎన్నిసార్లు చూస్తావురా అని మా నాన్న చాలాసార్లు అడిగారు కూడా!)

వాస్తవానికి నా ఒక్కడికే కాదు, నాలాంటి చాలా చాలా చాలా మందికి ఈ సినిమా ఒక అడిక్షన్! బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు కొల్లగొట్...