భారతదేశం, అక్టోబర్ 30 -- చట్టబద్ధమైన వలసలపై నియంత్రణలు కఠినతరం చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం.. వీసా, గ్రీన్‌కార్డ్ నిబంధనల్లో కీలక మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగా విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించే 'ఈబీ-5' (EB-5) ఇమ్మిగ్రెంట్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ దరఖాస్తుల రుసుములను అమాంతం పెంచేసింది. అమెరికా పౌరసత్వ, వలసల సేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్) పర్యవేక్షణలోని ఈబీ-5 విధానంలో దరఖాస్తు ప్రక్రియను మార్చుతూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్) కొత్త నిబంధనలు జారీ చేసింది.

అమెరికాలో వ్యాపారాలు ప్రారంభించి, స్థానికులకు ఉపాధి కల్పించే విదేశీయులకు శాశ్వత నివాస హోదా (గ్రీన్‌కార్డ్) కల్పించే అద్భుతమైన అవకాశం ఈబీ-5 వీసా. దీనికి అర్హత సాధించాలంటే ఎంపిక చేసిన ఏదైనా సంస్థలో కనీసం 1.05 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలి. అదే గ్రామీణ ప్రాంత...