భారతదేశం, మార్చి 22 -- తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దేవరపల్లి మండల పరిధిలోని యర్నగూడెం వద్ద ఉన్న జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొనగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు గాయపడ్డారు.
పోలీసుల వివరాల ప్రకారం.. రాజమండ్రి వైపు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఓ కారు. డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ప్రమాద దాటికి స్పాట్ లోనే ముగ్గురు చనిపోయారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానిక వాహన దారులు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారికి అంబులెన్స్ సహాయంలో హాస్పిటల్కు తరలించారు. కార్లలో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసి పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. ఘటన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.