భారతదేశం, ఏప్రిల్ 25 -- Shraddha Kapoor Nora Fatehi Out From Drugs Case: బాలీవుడ్‌ను ఒకప్పుడు కుదిపేసిన 2022 మెఫెడ్రోన్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న హీరోయిన్స్ శ్రద్ధా కపూర్, నోరా ఫతేహిలతో పాటు శ్రద్ధా సోదరుడు సిద్ధాంత్ కపూర్, సోషల్ మీడియా స్టార్ ఓరీ (Orry), రాజకీయ నాయకుడు జీషాన్ సిద్ధిఖీలకు క్లీన్ చిట్ లభించింది.

ముంబై పోలీసుల యాంటీ నార్కోటిక్స్ సెల్ (ANC) దాఖలు చేయనున్న అనుబంధ ఛార్జ్‌షీట్ నుంచి వీరి పేర్లను తొలగించనున్నారు. శ్రద్ధా కపూర్, నోరా, ఓరి, సిద్ధాంత్, జీషాన్ డ్రగ్స్ తీసుకున్నట్లు తగిన సాక్ష్యాలు లేని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాల సమాచారం.

ఈ కేసు మూలాలు 2022 నాటి డ్రగ్స్ దందాలో ఉన్నాయి. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మహ్మద్ సలీం అలియాస్ సుహైల్ షేక్ అనే డ్రగ్ పెడ్లర్‌...