భారతదేశం, మే 19 -- Drishyam 3: మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఆదరణ పొందిన 'దృశ్యం' ఫ్రాంచైజీ నుంచి రాబోతున్న మూడో భాగం థియేటర్లలో అలరించేందుకు సిద్ధమైంది. సూపర్ స్టార్ మోహన్‌లాల్ 66వ పుట్టినరోజును పురస్కరించుకుని మే 21న ఈ దృశ్యం 3 సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన 'దృశ్యం 3' సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆదివారం అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా, కేవలం బుక్‌మైషో ప్లాట్‌ఫామ్‌లోనే 3.34 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడై ఈ చిత్రం సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది.

ప్రంచవ్యాప్తంగా 'దృశ్యం 3' ప్రీ-సేల్స్ ద్వారా ఇప్పటికే రూ. 20 కోట్లకు పైగా వసూలు చేసినట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ప్రముఖ బాక్సాఫీస్ ట్రాకింగ్ పోర్టల్ సక్నిల్క్ నివేదిక ప్రకారం...