భారతదేశం, ఏప్రిల్ 4 -- ప్రముఖ నటుడు, రచయిత, గాయకుడు పీయూష్ మిశ్రా అంటే తెలియని సినిమా ప్రేమికులు ఉండరు. అయితే, వెండితెరపై ఎంతో హుందాగా కనిపించే పీయూష్ మిశ్రా జీవితంలో ఒక చీకటి కోణం ఉంది. అది 'మద్యపానం'. సుదీర్ఘకాలం పాటు తాగుడుకు బానిసైన పీయూష్, ఆ వ్యసనం తనను ఎలా పాతాళానికి నెట్టేసిందో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మత్తులో తాను చేసిన తప్పులను తలచుకుంటూ పీయూష్ మిశ్రా ఎమోషనల్ అయ్యారు.
శుభంకర్ మిశ్రా పాడ్కాస్ట్లో పాల్గొన్న పీయూష్ మిశ్రా వ్యసనం మనిషిని ఎలా లోబరుచుకుంటుందో వివరించారు. "ఒకానొక దశలో మద్యం తాగడం తప్పనిసరి అనిపిస్తుంది. తాగే కొద్దీ ఇంకా తాగాలనే కోరిక పెరుగుతుంది. మద్యపానం అనేది ఒక ప్రాణాంతక వ్యాధి. మనకు ఇష్టం ఉన్నా లేకున్నా శరీరం మద్యాన్ని కోరుకుంటుంది. ఆ నరకాన్ని నేను స్వయంగా అనుభవించాను" అని పీయూష్ మిశ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.