భారతదేశం, మే 20 -- Dragon Glimpse: జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే రోజు ఫ్యాన్స్ కు ఇచ్చిన గిఫ్ట్ అదిరింది. ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ సినిమాకు 'డ్రాగన్' అనే పేరును అధికారికంగా అనౌన్స్ చేశారు. ప్రత్యేక గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. డ్రాగన్ మూవీ ప్రపంచాన్ని పరిచయం చేసిన ఈ గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

చాలా రోజులుగా సాగుతున్న సస్పెన్స్‌కు తెరదించుతూ.. ఎన్టీఆర్-నీల్ మూవీకి 'డ్రాగన్' (Dragon) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఇవాళ (మే 20) ఎన్టీఆర్ బర్త్ డే. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి 11.52 గంటలకు గ్లింప్స్ రిలీజ్ చేశారు.

4.28 నిమిషాల నిడివి ఉన్న ఈ గ్లింప్స్ వీడియో డ్రాగన్ సినిమా ప్రపంచాన్ని, అందులోని కీలక పాత్రలను, వారి ఉద్దేశాలను స్పష్టంగా చూపిస్తూనే థియేటర్లలో పూనకాలు తెప్పించే స్థాయి యాక్షన్‌న...