భారతదేశం, ఆగస్టు 30 -- Suryapet Double Murder Case : సూర్యాపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇళ్ల సరిహద్దులోని ఒక వేపచెట్టు విషయమై రెండు పొరుగు కుటుంబాల మధ్య చాలా ఏళ్లుగా నడుస్తున్న వివాదం శనివారం హత్యాకాండగా మారింది. ఈ ఘోర ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. అడ్డుకోబోయిన ఒక సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలోని ఒక చిన్న పల్లెటూర్లో ఉన్న రెండు పొరుగు కుటుంబాల మధ్య వారి ఇళ్ల సరిహద్దులో ఉన్న వేపచెట్టు విషయంలో గత కొన్నేళ్లుగా తీవ్ర వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో శనివారం రోజున ఒక పొరుగింటి వ్యక్తి ఆ వేపచెట్టును నరికేశారు. అలా నరికిన చెట్టు కొమ్మలు పక్కనే ఉన్న మరో పొరుగింటి ఆవరణలో పడ్డాయి. ఈ విషయమై ఇరు కుటుంబాల మ...