భారతదేశం, ఏప్రిల్ 26 -- వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో కాల్పులకు తెగబడిన నిందితుడి వివరాలను భద్రతా సంస్థలు వెల్లడించాయి. నిందితుడిని కాలిఫోర్నియాలోని టోరెన్స్‌కు చెందిన కోల్ టోమాస్ అలెన్​గా గుర్తించారు. అతని వయస్సు 31ఏళ్లు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. నిందితుడికి అత్యున్నత విద్యా నేపథ్యం ఉండటమే కాకుండా గతంలో నాసా వంటి ప్రతిష్టాత్మక సంస్థలో పని చేసిన అనుభవం కూడా ఉంది.

స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి.. వాషింగ్టన్​లో మీడియా కరస్పాండెంట్స్​తో డిన్నర్​ ఈవెంట్​ జరిగింది. ఈ ఈవెంట్​కి ట్రంప్​, ఆయన భార్యతో హాజరయ్యారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్​ సైతం ఈవెంట్​లో పాల్గొన్నారు. కాగా.. ట్రంప్​ ప్రసంగానికి కొన్ని నిమిషాల ముందు కాల్పుల శబ్దాలు వినిపించాయి. వెంటనే పరిస్థితి గందరగోళంగా మారింది. ట్రంప్​ని అధికారులు అక్...