భారతదేశం, సెప్టెంబర్ 12 -- Don't Be Shy Trailer Released And OTT Streaming: బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అలియా భట్, నిర్మాతగానూ వరుస వైవిధ్యమైన ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నారు. ఆమె సొంత నిర్మాణ సంస్థ 'ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్' పతాకంపై రూపుదిద్దుకున్న నూతన చిత్రం 'డోంట్ బీ షై' (Don't Be Shy) ట్రైలర్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ శుక్రవారం (సెప్టెంబర్ 11) విడుదల చేసింది.

టీనేజ్ డ్రామా, క్యాంపస్ రొమాన్స్ కలగలిపిన కథాంశంతో ఈ ఓటీటీ సినిమా రూపుదిద్దుకుంది. సుమారు 2 నిమిషాల 32 సెకన్ల నిడివి ఉన్న ఈ డోంట్ బీ షై ట్రైలర్ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటోంది.

శ్యామిలీ అలియాస్ 'షై' దాస్ (ఆరుషి బజాజ్) అనే కళాశాల విద్యార్థిని చుట్టూ ఈ కథ తిరుగుతుంది. జీవితంలో ప్రతీ విషయాన్ని ముందే ప్రణాళిక వేసుకునే షై ఆశలు ఉన్నట్టుండి తలకిందులవుతాయి. ఈ క్రమంలో ఆమె కళాశాలలో...