భారతదేశం, మార్చి 29 -- ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. డాక్టర్ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ముగ్గురు చనిపోయారు. ఈ విషాదఘటన నరసారావుపేట.. లాడ్జిలో జరిగింది. ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

నాదెండ్ల మండలం సాతులూరుగా చెందిన ఓ డాక్టర్ ఫ్యామిలీ ప్రాణాలు తీసుకున్నది. ఏం సమస్య వచ్చిందో తెలియదుగానీ.. మూడేళ్ల చిన్నారితోపాటుగా భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది.

నాదెండ్ల మండలం సాతులూరుకు చెందిన డాక్టర్ గోపి కుటుంబం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నివాసం ఉంటోంది. భోపాల్ ఎయిమ్స్‌ ఆసుపత్రిలో గోపి డాక్టర్‌గా పనిచేస్తున్నారు. అతడి భార్య శంకర కుమారి నర్సుగా చేస్తోంది. వీరికి మూడేళ్ల చిన్నారి మౌనిక ఉంది.

ఈ కుటుంబం శనివారం రాత్రి భోపాల్ నుంచి నరసరావుపేటకు వచ్చింది. ఆ తర్...