భారతదేశం, మార్చి 23 -- రాష్ట్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో మరో పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే దానం నాగేందర్ పై దాఖలైన అనర్హత పిటిషన్ ను స్పీకర్ డిస్మిస్ చేయటాన్ని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం.. తాజాగా ఎమ్మెల్యే దానం నాగేందర్ కు నోటీసులు జారీ చేసింది.

దానం పార్టీ మారిన వ్యవహారంపై స్పీకర్‌ తీర్పును కొట్టేయాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి తన పిటిషన్‌లో ప్రస్తావించారు. బీఆర్‌ఎస్‌ నుంచి గెలవటమే కాకుండా. కాంగ్రెస్‌ నుంచి సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారని తెలిపారు. ఇతర పార్టీ నుంచి నామినేషన్‌ వేసిన రోజు నుంచే అనర్హుడిగా ప్రకటించాలని కోరారు.

ఈ పిటిషన్ పై విచారించిన కోర్టు.. కౌంటర్‌ దాఖలు చేయాలని దానం నాగేందర్‌కు నోటీసులు ఇచ్చింది. అంతేకాకుండా అసెంబ్లీ కార్యద...