భారతదేశం, ఏప్రిల్ 7 -- బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన 'ధురంధర్ 2: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద తన జైత్రయాత్రను నిరాటంకంగా కొనసాగిస్తోంది. భారతదేశంలో ధురంధర్ 2 రూ. 1000 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించిన మొట్టమొదటి హిందీ చిత్రంగా చరిత్ర సృష్టించింది. అలాగే, ఈ సినిమా మూడో వారాంతం తర్వాత కూడా గట్టి పోటీనిస్తోంది.

ప్రముఖ ట్రేడ్ వెబ్‌సైట్ 'సక్నిల్క్' (Sacnilk) అందించిన గణాంకాల ప్రకారం, 'ధురంధర్ 2' మూడో సోమవారం (19వ రోజు) దేశీయంగా రూ. 10.00 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో భారత్‌లో 19 రోజుల్లో ధురంధర్ 2 చిత్రం నెట్ కలెక్షన్స్ రూ. 1,023.77 కోట్లకు చేరుకున్నాయి. అలాగే, రూ. 1213.74 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా.

మొదటి వారం: రూ. 674.17 కోట్లు (నెట్)

రెండో వారం: రూ. 263.65 కోట్లు...