భారతదేశం, మార్చి 22 -- బాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఆదిత్య ధర్, రణ్‌వీర్ సింగ్ కాంబినేషన్‌లో వచ్చిన 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. 2025లో ఘనవిజయం సాధించిన 'ధురంధర్'కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం, కేవలం మూడు రోజుల్లోనే రూ. 300 కోట్లకుపైగా నెట్ వసూళ్ల మార్కును దాటి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. వీకెండ్ కావడంతో థియేటర్ల వద్ద రద్దీ మరింత పెరిగింది.

ప్రముఖ ట్రేడ్ వెబ్‌సైట్ సక్నిల్క్ (Sacnilk) గణాంకాల ప్రకారం, ధురంధర్ ది రివేంజ్ చిత్రం మార్చి 18న జరిగిన ప్రీమియర్ షోల ద్వారానే రూ. 43 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఇక మార్చి 19న అధికారికంగా విడుదలైన మొదటి రోజు రూ. 102.55 కోట్లు కొల్లగొట్టి రికార్డు స్థాయి ఓపెనింగ్స్ రాబట్టింది.

శుక్రవారం (మార్చి 20) నాడు వసూళ్లలో స్వల్ప తగ్గుదల కనిపించినా రూ. 80.72 కోట్లు రాబట్టి సత్...