భారతదేశం, మార్చి 31 -- బాక్సాఫీస్ వద్ద రణ్‌వీర్ సింగ్ గూఢచారిగా చేసిన వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ధురంధర్ 2: ది రివెంజ్' రెండో వారంలోనూ తన జోరు చూపిస్తోంది. వీకెండ్ ముగిసి వర్కింగ్ డేస్ ప్రారంభం కావడంతో వసూళ్లలో సహజమైన తగ్గుదల కనిపించినప్పటికీ, ఓవరాల్‌గా ఈ సినిమా సృష్టిస్తున్న రికార్డులు మాత్రం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నాయి.

ధురంధర్ 2 సినిమా విడుదలైన 12వ రోజు (రెండో సోమవారం మార్చి 30) అంటే నిన్న ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 25.30 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. దీంతో దేశీయంగా ఈ చిత్రం మొత్తంగా రూ. 872.17 కోట్ల నెట్ (రూ. 1,042.23 కోట్ల గ్రాస్) మార్కును చేరుకుంది.

కేవలం ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ తన సత్తా చాటుతోంది. ఓవర్సీస్ మార్కెట్‌లో ఇప్పటివరకు ధురంధర్ 2 రూ. ...