భారతదేశం, మార్చి 11 -- రికార్డుల వేటకు ధురంధర్ 2 రెడీ అయింది. బాక్సాఫీస్ ను బద్దలు కొట్టేందుకు సై అంటోంది. అడ్వాన్స్ టికెట్ సేల్స్ లో ధురంధర్ 2 హిస్టరీ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతోంది. ర‌ణ్‌వీర్ సింగ్‌ హీరోగా నటించిన ధురంధర్ 2 ప్రీమియర్ షో టికెట్ సేల్స్ లో దూసుకెళ్తోంది.

ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ధురంధర్ 2 ఒకటి. బ్లాక్ బస్టర్ మూవీ ధురంధర్ కు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మార్చి 19న రిలీజ్ కానుంది. అంతకంటే ఒక రోజు ముందు మార్చి 18న ధురంధర్ 2 మూవీ ప్రీమియర్ షోలు వేయనున్నారు. ఈ ప్రీమియర్ షోల టికెట్ సేల్స్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాయి.

గత వారం ధురంధర్ 2 మూవీ అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు దేశవ్యాప్తంగా 8,337 షోలకు గాను 3.48 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఈ చిత్రం ఇప్పటివరకు దాని ప్రీమి...