భారతదేశం, మే 19 -- Dhurandhar 2 OTT : ఇటీవలి కాలంలో వన్ ఆఫ్​ ది బెస్ట్​ సినిమ్యాటిక్​ ఎక్స్​పీరియెన్స్​ ఇచ్చిన చిత్రాల్లో 'ధురంధర్​' ఒకటని అనడంలో సందేహం లేదు. ఆదిత్య ధర్ పీక్​ డీటైలింగ్​తో వచ్చిన ధురంధర్​ 1, ధురంధర్​ 2 సినిమాలు బాక్సాఫీసు వద్ద ఎంతటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సినిమాకి సంబంధించిన అనేక విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. రెండో పార్ట్​లో రణవీర్​ సింగ్​ పోషించిన హంజా కుటుంబం పాత్ర పాకిస్థాన్​లో ఒక లగ్జరీ విల్లాలో ఉన్నట్టు చూపిస్తారు. వాస్తవానికి అది అమృత్​సర్​ దగ్గరిలో ఉందని గతంలో తెలిసింది. ఇక ఇప్పుడు ఆ సినిమాల్లో తరచూ చూపించే చాయ్​ షాపు ఒరిజినల్​ లొకేషన్ సైతం బయటపడింది. అది తెలిసిన వారందరు షాక్​ అవుతున్నారు.

సినిమాల్లో కొన్ని లొకేషన్లు ఎంత అందంగా, పద్ధతిగా కనిపిస్తాయంటే.. ప్రేక్షకులు అ...