భారతదేశం, ఏప్రిల్ 8 -- దర్శకుడు ఆదిత్య ధర్ వెండితెరపై సృష్టించే మ్యాజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాల్లో ప్రతి ఫ్రేమ్ వెనుక ఒక బలమైన అర్థం ఉంటుంది. తాజాగా విడుదలైన 'ధురంధర్' సిరీస్‌లో రణ్‌వీర్ సింగ్ పోషించిన జస్కిరాత్ సింగ్ రంగీ (హంజా అలీ మజారీ) పాత్రను ప్రేక్షకులు ఓ రేంజ్‌లో ఓన్ చేసుకున్నారు.

అయితే, ఈ పాత్ర కేవలం ఒక గూఢచారి కథ మాత్రమే కాదు, దీని వెనుక ఆధ్యాత్మిక ప్రతీకలు ఉన్నాయని మాజీ మిస్ ఇంగ్లాండ్ డాక్టర్ భాషా ముఖర్జీ చేసిన విశ్లేషణ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. 'ధురంధర్ 2' క్లైమాక్స్‌లో వచ్చే ఒక సన్నివేశాన్ని భాషా ముఖర్జీ ఉదహరించారు.

హంజాను పాకిస్థాన్ సైన్యం బంధించి చిత్రహింసలకు గురిచేసే సీన్ అది. రక్తపు మడుగులో ఉండి, చేతులు పైకి కట్టేసి ఉన్న రణ్‌వీర్ సింగ్ రూపం.. సరిగ్గా సిలువపై ఉన్న ఏసుక్రీస్తును తలపిస్తు...