భారతదేశం, జూలై 7 -- Dhoni Birthday: టీమిండియాకు అన్ని రకాల ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని బర్త్ డే ఇవాళ (జూలై 7). మైదానంలో హెలికాప్టర్ షాట్లతో అలరించిన ధోని, ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై సరికొత్త రూట్‌లో దూసుకుపోతున్నాడు.

ఎంఎస్ ధోని ఐపీఎల్ కు గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నాడని టాక్. గాయం కారణంగా 2026 ఐపీఎల్ సీజన్ లో ధోని ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇప్పుడు ధోనికి 45 ఏళ్లు. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్ లో ధోని ఆడటం కష్టమే. దీంతో తలా ధోని ఇప్పుడు ప్రొడ్యూసర్ కెరీర్ పై ఫోకస్ పెట్టాడని టాక్.

తన భార్య సాక్షి సింగ్ తో కలిసి ధోని 'ధోని ఎంటర్‌టైన్‌మెంట్' బ్యానర్ ను స్థాపించాడు. ఇప్పుడీ బ్యానర్ పై బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ప్లాన్ చేస్తూ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాడు ధోని.

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ...