భారతదేశం, ఏప్రిల్ 30 -- CH Satish Kumar About Dhanush Kara Release: తమిళ స్టార్ హీరో ధనుష్, బ్యూటిపుల్ మమితా బైజు జంటగా నటించిన లేటెస్ట్ మూవీ కర. కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఐషరి కె. గణేష్ నిర్మించిన ఈ చిత్రానికి విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించారు.

కర మూవీని ఏప్రిల్ 30న అంటే, ఇవాళే విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సీహెచ్. సతీష్ కుమార్ మీడియాతో చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ఆయన ఏం చెప్పారంటే..

-"మాది విశాఖపట్నం. చిన్న సినిమాల్ని కొంటూ డిస్ట్రిబ్యూషన్ స్టార్ చేశాను. ఆ తరువాత ఓ మూవీని కూడా నిర్మించాను. 'అర్జున్ రెడ్డి', 'కబాలి', 'సింగం 3', 'సలార్', 'కాంతారా చాప్టర్ 1' వంటి సినిమాల్ని ఉత్తరాంధ్రలో డిస్ట్రిబ్యూషన్ చేశా...