భారతదేశం, జూన్ 16 -- Risk Devudu Varamandisthe Song Release And Contest: టాలీవుడ్‌లో ఒకప్పుడు చార్ట్‌బస్టర్ సాంగ్స్‌తో అలరించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన సరికొత్త అవతారంలో మెగా ఫోన్ పట్టి, దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ 'రిస్క్'.

జీకే మిరాకిల్స్ బ్యానర్‌పై సందీప్ అశ్వ, సాన్యా ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న రిస్క్ చిత్రంపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. యూత్‌ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు.

ఇప్పటికే విడుదలైన రిస్క్ మూవీ ట్రైలర్, ఫస్ట్ లుక్ పోస్టర్లు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. కంటెంట్ చాలా ప్రామిసింగ్‌గా ఉండటంతో ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడ...