భారతదేశం, సెప్టెంబర్ 4 -- Delulu Movie Teaser Released: యువతలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న 'డెలులు' అనే పదాన్నే టైటిల్‌గా తెరకెక్కుతున్న చిత్రం 'డెలులు'. ప్రీతం కస్తూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్ బ్యానర్‌పై సంకీర్త్ కొండ నిర్మిస్తున్నారు.

ఈ డెలులు సినిమాకు విజయ్ రాజ్‌కుమార్ కథ, అదనపు సంభాషణలు అందించగా.. రెష్మిత్ ఎస్. కౌశిక స్క్రీన్‌ప్లే, సంభాషణలు రాశారు. టైటిల్‌ నుంచే విభిన్నంగా అనిపిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. యువతరం నటీనటులతో తెరకెక్కుతున్న 'డెలులు' మూవీ టీజర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది.

ఒక నిమిషం 32 సెకండ్ల నిడివి ఉన్న ఈ డెలులు టీజర్‌.. 'బ్రేకప్ దేవా' అనే డైలాగ్‌తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు, పాత్రల మధ్య జరిగే సరదా సంభాషణలు టీజర్‌కు మంచి ఫన్‌ టచ్...