భారతదేశం, ఫిబ్రవరి 27 -- ఢిల్లీ లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ అప్పీల్ చేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా ఇతర నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరింది.

రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే సీబీఐ. తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణలో భాగంగా తాము సేకరించిన కీలక అంశాలను మరియు సాక్ష్యాలను ట్రయల్ కోర్టు సరిగ్గా పరిగణనలోకి తీసుకోలేదని సీబీఐ(కేంద్ర దర్యాప్తు సంస్థ) పేర్కొంది. దర్యాప్తు సంస్థ సమర్పించిన సాక్ష్యాధారాలను విస్మరించడం జరిగిందని. తక్షణమే ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని హైకోర్టును కోరింది.

రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ సవాల్ చేయటంతో.. ఈ పిటిషన్...