భారతదేశం, నవంబర్ 17 -- లగ్జరీ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీల ప్రపంచంలో రారాజుగా వెలుగొందుతున్న 'ల్యాండ్ రోవర్ డిఫెండర్' ఇప్పుడు సరికొత్త ఎలక్ట్రిక్ అవతారంలో రాబోతోంది. టాటా మోటార్స్ యాజమాన్యంలోని బ్రిటిష్ దిగ్గజం జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేెఎల్​ఆర్) తన తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ డిఫెండర్ రాకపై అధికారికంగా స్పష్టతనిచ్చింది. 2027లో ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. అయితే ప్రస్తుతం రోడ్లపై పరుగులు తీస్తున్న పెట్రోల్, డీజిల్ డిఫెండర్ మోడళ్లతో పోలిస్తే, రాబోయే ఎలక్ట్రిక్ డిఫెండర్ పరిమాణంలో కాస్త చిన్నదిగా ఉండనుంది!

గత కొన్నేళ్లుగా ఈ చిన్న సైజు ఎలక్ట్రిక్ డిఫెండర్ గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తుండగా, తాజాగా జేఎల్ఆర్ సంస్థ ఒక నిర్దిష్ట కాలపరిమితిని ఖరారు చేసింది.

2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాల సందర్భ...