భారతదేశం, ఏప్రిల్ 19 -- Deepika Padukone Announces Second Pregnancy: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె మరోసారి తల్లి కాబోతుంది. తాజాగా తన రెండో ప్రెగ్నెన్సీని అత్యంత క్యూట్‌గా ప్రకటించింది రణ్‌వీర్ సింగ్-దీపిక పదుకొణె జంట. ఆదివారం (ఏప్రిల్ 19) తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక అరుదైన చిత్రాన్ని షేర్ చేస్తూ అభిమానులకు తీపి కబురు చెప్పింది దీపిక.

ఆ ఫొటోలో కూతురు 'దువా' చేతిలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఉంది. అందులో రెండు స్పష్టమైన పింక్ లైన్లు కనిపిస్తున్నాయి. అంటే దువా ఇప్పుడు 'అక్క' కాబోతుందన్నమాట. ఈ ఫొటోలో దీపికా, రణ్‌వీర్ చేతులు తమ కూతురిని అక్కున చేర్చుకున్నట్లుగా ఉండటం చూస్తుంటే ఆ కుటుంబంలో సంతోషం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎటువంటి ఆర్భాటం లేకుండా కేవలం 'దిష్టి చుక్క' (Evil Eye) ఎమోజీలతో ఈ పోస్ట్‌ను షేర్ చేశారు.

కూతురు దువా పద...