భారతదేశం, ఏప్రిల్ 30 -- Lara Dutta About Deepika Padukone: సాధారణంగా గ్లామర్ ప్రపంచంలో నటీనటులు ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తారు కానీ, ఆ కెమెరా వెనుక వారు పడే శ్రమ, ఆరోగ్య సమస్యలు ప్రేక్షకులకు పెద్దగా తెలియవు. 2010లో వచ్చిన 'హౌస్‌ఫుల్' సినిమా షూటింగ్ సమయంలో దీపికా పదుకొణె ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మరో హీరోయిన్ లారా దత్తా తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. లండన్ షెడ్యూల్ సమయంలో దీపికా పదుకొణెకు మలేరియా సోకింది. వణుకు పుట్టించే జ్వరం ఉన్నా దీపికా ఏమాత్రం వెనక్కి తగ్గలేదని లారా కొనియాడారు.

దీపికా పదుకొణె అంకితభావం గురించి లారా దత్తా మాట్లాడుతూ.. "షూటింగ్ జరుగుతున్నప్పుడు దీపికాకు మలేరియా సోకింది. ఆమె నీరసించిపోయి నడవలేని స్థితిలో ఉన్నారు. రాత్రంతా జ్వరంతో వణుకుతూ ఉండేవారు. వైద్యులు వచ్చి మందులు ఇస్తున్నా, మరుసటి రోజు ఉదయం కల్...