భారతదేశం, జూన్ 22 -- Accident In Ranbir Kapoor Alia Bhatt Love And War Movie Set: వెండితెరపై కనిపించే రంగుల ప్రపంచం వెనుక వందలాది మంది కార్మికుల రక్తం, చెమట దాగుంటాయి. ఒక్కోసారి ఆ రంగుల ప్రపంచంలో జరిగే ప్రమాదాలు కార్మికుల కుటుంబాల్లో కోలుకోలేని చీకట్లను నింపుతాయి.

తాజాగా రణ్‌బీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్‌తో బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'లవ్ అండ్ వార్' (Love & War) సెట్‌లో ఒక ఘోర ప్రమాదం జరిగింది. ముంబైలోని ఫిల్మ్ సిటీలో గల రాయల్ పంప్ స్టూడియోలో జూన్ 17న తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.

సెట్ నిర్మాణ పనుల్లో ఉన్న చంద్రధారి సింగ్ యాదవ్ (42) అనే కార్పెంటర్ విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమిక విచారణ ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప...