భారతదేశం, మే 18 -- ఐపీఎల్ 2026 లీగ్​ స్టేజ్ ముగింపు దశకు చేరుకుంటున్న కొద్దీ ప్లేఆఫ్స్ రేసు అత్యంత ఉత్కంఠభరితంగా మారుతోంది! ఆదివారం రాత్రి దిల్లీలో జరిగిన కీలక పోరులో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) పై దిల్లీ క్యాపిటల్స్ (డీసీ) 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్.. ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్‌ల హాఫ్ సెంచరీల సహాయంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. అనంతరం 194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ క్యాపిటల్స్.. ఓపెనర్లు అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్ అందించిన అద్భుత భాగస్వామ్యం, చివర్లో అక్షర్ పటేల్ మెరుపు ఇన్నింగ్స్ తో మరో 4 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి!

ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ 12 ...