భారతదేశం, అక్టోబర్ 25 -- డేటింగ్ యాప్‌లో పరిచయమైన ఓ అందమైన అమ్మాయి 'కాఫీ తాగుదాం పదా' అని పిలిస్తే.. శేఖర్ అనే వ్యక్తి గుండెల్లో సంతోషమైంది. 'నాకూ ఒక రోమియో కథ దొరికింది' అని సంబరపడిపోతూ, జూబ్లీహిల్స్‌లోని ఒక రిచ్ రెస్టారెంట్‌కు వెళ్లాడు. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా సాగింది. మాటలు, నవ్వులు, రకరకాల వంటకాలతో కాలాన్ని మర్చిపోయారు.

కానీ అసలు ట్విస్ట్ బిల్లు రూపంలో ముంగిట వాలినప్పుడే ఎదురైంది. చేతికి వచ్చిన బిల్లు చూసి శేఖర్ కళ్ళు బైర్లు కమ్మాయి. అక్షరాలా రూ.28,000 బిల్లు. ఓ సాధారణ ఉద్యోగి నెల జీతం, కొంతమందికి అంతకంటే ఎక్కువనే. బిల్లు వచ్చేముందు అమ్మాయి తన తెలివి ఉపయోగించింది. ఓయ్ కాసేపట్లో వస్తాను.. అని వాష్‌రూమ్ సాకు చెప్పి లేచి వెళ్లింది. మళ్లీ తిరిగి రాలేదు. పాపం, శేఖర్ జేబు ఖాళీ చేసుకుని, హృదయం గాయపడి, ఏం చేయాలేక పోయిన సొమ్మును తలుచుకుంటూ ...