Dasara Holidays 2026 : తెలంగాణ, ఏపీల్లో దసరా సెలవుల షెడ్యూల్.. అక్టోబర్లో ఎప్పటినుంచంటే?
భారతదేశం, సెప్టెంబర్ 20 -- దసరా పండుగ అనగానే పాఠశాల విద్యార్థులకు గుర్తొచ్చేది సెలవులే. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో దసరా సెలవుల షెడ్యూల్ను విద్యాశాఖ విడుదల చేసింది. రెండు రాష్ట్రాల్లోనూ దసరా పండుగ ఉత్సాహం నెలకొన్నప్పటికీ, పాఠశాలలకు ఇచ్చే సెలవుల వ్యవధిలో వ్యత్యాసం ఉంది.
తెలంగాణ పాఠశాల అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ విద్యాసంస్థలకు మొత్తం 13 రోజుల పాటు దసరా సెలవులు లభించనున్నాయి. సెలవుల ప్రారంభం 2026 అక్టోబర్ 10 నుంచి ఉంటాయి. దసరా సెలవులకు ముందు చివరి వర్కింగ్ డే అక్టోబర్ 9. ఇక అక్టోబర్ 22వ తేదీ దాకా సెలవులు ఉంటాయి. పాఠశాలలు అక్టోబర్ 23న పునఃప్రారంభం అవుతాయి. తెలంగాణ విద్యార్థులకు అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 22 వరకు వరుసగా 13 రోజులు సెలవులు రానుండటంతో గ్రాండ్ లాంగ్ వెకేషన్ లభించినట్లయిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.