భారతదేశం, అక్టోబర్ 16 -- Danny Movie Release Date Poster Out 2026: టాలీవుడ్‌లో ఊరమాస్ రస్టిక్ డ్రామాలకు, విభిన్నమైన కాన్సెప్ట్ చిత్రాలకు ఎప్పుడూ ప్రత్యేక ఆదరణ ఉంటుంది. 'నాటకం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సరికొత్త మాస్ అనుభూతిని అందించిన హీరో ఆశిష్ గాంధీ, దర్శకుడు కళ్యాణ్ జీ గోగన కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది.

వీరిద్దరి కలయికలో రూపుదిద్దుకుంటున్న లేటెస్ట్ టాలీవుడ్ చిత్రం 'డానీ'. ప్రేమ, క్రైమ్, తీవ్రమైన భావోద్వేగాల మేళవింపుగా వస్తున్న డానీ చిత్రాన్ని నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా తాజాగా ప్రకటించారు.

ఇటీవల డానీ సినిమా నుంచి విడుదలైన 'ఫస్ట్ స్ట్రైక్' ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో, సినీ వర్గాల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది. సాధారణ ప్రేమకథల బాటలో కాకుండా, మనుషుల వ్యసనాలు లేదా అలవాట్...