భారతదేశం, ఏప్రిల్ 22 -- DA Hike News: పెరుగుతున్న నిత్యావసర ధరలతో సతమతమవుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తీపి కబురు అందించింది. 2026 జనవరి 1వ తేదీ నుంచి వర్తించేలా కరువు భత్యం (Dearness Allowance - DA)ను పెంచుతూ ఏప్రిల్ 22న డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ కీలక ప్రకటన చేసింది. తాజా పెంపుతో కేంద్ర ఉద్యోగుల డీఏ 58 శాతం నుంచి 60 శాతానికి చేరుకుంది.
గత ఏడాది అక్టోబర్ 6న సిద్ధం చేసిన ప్రతిపాదనలకు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో, ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఈ పెంపును అమల్లోకి తెచ్చారు. అంటే, ఉద్యోగులకు జనవరి నుంచి రావాల్సిన బకాయిలు (Arrears) కూడా లభిస్తాయి.
7వ వేతన సంఘం (7th CPC) సిఫార్సుల ప్రకారం నిర్ణయించిన పే మేట్రిక్స్‌లోని లెక్కల ఆధారంగానే ఈ పెంపు ఉంటుంది. ఇందులో కేవలం 'బేసిక్ పే'ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.