DA Hike: కేంద్ర ఉద్యోగులకు డీఏ పెంపు.. కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం
భారతదేశం, అక్టోబర్ 28 -- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ తీపి కబురు అందించింది. ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ), పెన్షనర్లకు కరువు ఉపశమనం (డీఆర్)ను 3 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు దేశీయంగా కంటైనర్ల తయారీని వేగవంతం చేసేందుకు రూ.10,000 కోట్ల భారీ పథకానికి, గ్రామీణ స్వరాజ్ బలోపేతానికి నిధుల కేటాయింపునకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ఈ వివరాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.
సవరించిన 3 శాతం డీఏ, డీఆర్లు 2026 జులై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో 1.16 కోట్లకు పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరనుంది. రాబోయే పండుగల వేళ జీతాలు, పెన్షన్లు పెరగనుండట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.