భారతదేశం, అక్టోబర్ 28 -- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ తీపి కబురు అందించింది. ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ), పెన్షనర్లకు కరువు ఉపశమనం (డీఆర్)ను 3 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు దేశీయంగా కంటైనర్ల తయారీని వేగవంతం చేసేందుకు రూ.10,000 కోట్ల భారీ పథకానికి, గ్రామీణ స్వరాజ్ బలోపేతానికి నిధుల కేటాయింపునకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ఈ వివరాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.

సవరించిన 3 శాతం డీఏ, డీఆర్‌లు 2026 జులై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో 1.16 కోట్లకు పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరనుంది. రాబోయే పండుగల వేళ జీతాలు, పెన్షన్లు పెరగనుండట...