భారతదేశం, జూన్ 5 -- Nalgonda Cylinder Blast : నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో విషాద ఘటన వెలుగుచూసింది. ఒకే ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఓ వృద్ధురాలితో పాటు ఆమె ఇద్దరు మైనర్ మనవళ్లు ఉన్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడలోని ఒక చిన్న రెండు గదుల ఇంట్లో చంద్రమ్మ (50) అనే మహిళ తన మనవడు లక్ష్మణ్ (17), మనవరాలు ప్రణతి (14)లతో కలిసి నివసిస్తోంది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత.. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా ఇంట్లోని వంటగ్యాస్ సిలిండర్ భారీ శబ్దంతో పేలిపోయింది.

అర్ధరాత్రి వేళ ప్రమాదం జరగడం.. ఇల్లు చిన్నది కావడంతో క్షణాల వ్యవధిలోనే మంటలు ఇల్లంతా వ్యాపించాయి. నిద్రలోనే మంటల మధ్య చిక్కుకుపోవడంతో ముగ్గురూ బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. తీవ్రమైన ...