Cyclone Murasu : మురసు తుపానుతో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్!
భారతదేశం, నవంబర్ 3 -- ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. మురసు తుపాను ప్రభావం కొనసాగుతుండటంతో భారత వాతావరణ శాఖ తీర ప్రాంతాల్లో ఆకస్మిక వరదల (flash floods) హెచ్చరికలను జారీ చేసింది. ఈ తుపాను మధ్యాహ్నానికల్లా బలహీనపడి సాధారణ తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసినప్పటికీ, మధ్యాహ్నం 3 గంటల సమయానికి కూడా అది బలహీనపడలేదు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో గంటకు 95-105 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి.
బాపట్ల, గుంటూరు, కృష్ణ, ఏలూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను ప్రభావంతో సముద్రపు నీరు పోటెత్తడం వల్ల ఈ జిల్లాల్లో మోడరెట్ స్థాయిలో వరద ముప్పు పొంచి ఉంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంత జిల్లా అయిన బాపట్లలో మంగళవారం కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.