Cyclone Akvan Update : అక్వాన్ తుపానుపై న్యూ అప్డేట్.. ఈ జిల్లాలకు మాత్రమే రెడ్ అలర్ట్
భారతదేశం, నవంబర్ 19 -- తీవ్ర తుపాను అక్వాన్(Cyclone Akvan) వల్ల ఆంధ్రప్రదేశ్‌పై పెద్దగా ప్రభావం ఉండే అవకాశం లేదు. భారత వాతావరణ శాఖ(IMD) తన ప్రాథమిక అంచనాలను సవరించింది. దీని ప్రకారం గురువారం (నవంబర్ 19, 2026) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం అనే మూడు జిల్లాల్లో మాత్రమే అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
గతంలో విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేయగా, ఇప్పుడు వాటిని నవంబర్ 19 కోసం ఆరెంజ్ అలర్ట్ పరిధిలోకి మార్చారు. నవంబర్ 20న రాష్ట్రంలో ఎక్కడా రెడ్ అలర్ట్‌లు లేవు. ఆ సమయంలో ఈ తుపాను ఒడిశాలోని గోపాల్పూర్ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. అయితే నవంబర్ 20న శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అక్కడక్కడా చాలా భారీ వర్షాలు కురిసే అవకాశం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.