Cyclone Akvan : బంగాళాఖాతంలో మరో తుపాను అక్వాన్.. ఏపీకి ముప్పు ఉందా?
భారతదేశం, నవంబర్ 13 -- బంగాళాఖాతం మరోసారి అల్లకల్లోలంగా మారుతోంది. ఇప్పటికే వరుస తుపానులతో వణికిపోయిన తీర ప్రాంతాలకు ఇప్పుడు మూడో తుపాను ముప్పు పొంచి ఉంది. నవంబర్ 18 నాటికి మధ్య బంగాళాఖాతంలో ఈ సీజన్లో మూడో తుపాను ఏర్పడే అవకాశం ఉందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ తాజాగా వెల్లడించింది. ఒకవేళ ఇది తుపానుగా బలపడితే దీనికి అక్వాన్ అని నామకరణం చేయనున్నారు.
దక్షిణ అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఈ అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుంది. ఇది మరింత బలపడి వాయుగుండంగా, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, గాలుల వేగం వంటి పర్యావరణ పరిస్థితులు అనుకూలిస్తే, ఈ వాయుగుండం మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
తుపానులకు ప్రపంచ వాతావరణ సంస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.