భారతదేశం, ఏప్రిల్ 24 -- CUET PG 2026: ఉన్నత విద్య కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక సమయం వచ్చేసింది. దేశంలోని ప్రతిష్టాత్మక కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర అనుబంధ విద్యాసంస్థల్లో ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంటెక్ వంటి పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET PG) ఫలితాలను ఎన్టీఏ (NTA) సిద్ధం చేసింది. మార్చి నెలలో జరిగిన ఈ పరీక్షల ఫలితాలు ఈరోజు ఏప్రిల్ 24, 2026న విడుదల చేసింది.

https://cnr.nic.in/Results26/CUETPg26/Login

ఈ ఏడాది సీయూఈటీ పీజీ పరీక్షలను మార్చి 6 నుండి మార్చి 27వ తేదీ వరకు వివిధ విడతల్లో నిర్వహించారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) పద్ధతిలో జరిగిన ఈ ఎగ్జామ్, అభ్యర్థుల సబ్జెక్ట్ నాలెడ్జ్‌ను పరీక్షించేలా ఉంది. లాంగ్వేజెస్, ఎంటెక్ వంటి కొన్ని పేపర్లు మినహా, మిగిలిన ప్రశ్నపత్రాలన్నీ హిందీ, ఇంగ్లీష...