భారతదేశం, నవంబర్ 14 -- వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. క్రికెట్ రంగంలో రాణించాలని కలలు కంటూ శిక్షణ తీసుకుంటున్న 17 ఏళ్ల యువ క్రీడాకారిణి నందిని ఆత్మహత్య చేసుకుంది. వికారాబాద్ పట్టణంలోని మధు కాలనీలో ఉన్న తన మేనమామ నివాసంలో ఆమె ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో నిత్యం వేధించడం వల్లే తమ బిడ్డ ఈ కఠిన నిర్ణయం తీసుకుందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నరు.

వికారాబాద్‌లోని మధు కాలనీలో ఉండే తన మేనమామ ఇంట్లో ఉంటూ నందిని క్రికెట్ సెలెక్షన్స్ కోసం శిక్షణ తీసుకుంటోంది. అయితే.. కొంతకాలంగా ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో ఆమెను తీవ్రంగా వేధిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారి వేధింపులు భరించలేకనే నందిని ఆత్మహత్యకు పాల్పడిందని వారు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ...