భారతదేశం, ఆగస్టు 16 -- సీపీఐ (మావోయిస్టు) పార్టీపై నిషేధాన్ని ఎత్తివేయాలని మాజీ మావోయిస్ట్ అగ్రనేతలు కోరుతున్నారు. ఇదే విషయంపై తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ.. తన సహచర నేతలతో కలిసి చర్చలు జరుపుతున్నారు. కలిసివచ్చే మాజీ సహచరులతో కలసి ప్రజల సమస్యలపై చట్టబద్ధంగా, బహిరంగంగా పనిచేయడానికి వీలుగా సీపీఐ (మావోయిస్టు) పార్టీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కోరే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే విషయంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి పంపాలని భావిస్తున్నారు.

లొంగిపోయిన మాజీ మావోయిస్టు నేతలు ఇటీవల తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసి తమ వినతులను సమర్పించారు. చనిపోయిన తమ పాత సహచరుల కుటుంబాలను పరామర్శించడం, చిన్న తరహా సమావేశాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు పోలీసుల నుంచి ఆంక్షలు ఎదురుకాకుండా చూడాలని కోరారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ...