భారతదేశం, అక్టోబర్ 10 -- Sree Vishnu Comrade Kalyan OTT Streaming: వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకోవడంతోపాటు డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో శ్రీవిష్ణు. ప్రయోగాత్మక చిత్రాలకు వినోదాన్ని జోడించి ప్రేక్షకులను అలరించడంలో మంచి క్రెజ్ తెచ్చుకున్నాడు.

అలాంటి శ్రీవిష్ణు నుంచి ఓ సినిమా వస్తుందంటే మంచి అంచనాలు ఉంటాయి. ఈ క్రమంలోనే శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కామ్రేడ్ కళ్యాణ్‌పై మంచి ఎక్స్‌పెక్టెషన్స్ ఉన్నాయి. ఈ అంచనాల నడుమ తాజాగా నిన్న అంటే అక్టోబర్ 9న థియేటర్లలో కామ్రేడ్ కళ్యాణ్ సినిమా విడుదలైంది.

కామెడీ, విప్లవాత్మక అంశాల కలబోతగా తెరకెక్కిన ఈ పీరియాడిక్ కామెడీ డ్రామా కామ్రేడ్ కళ్యాణ్ సినిమాకు జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహించారు. మహిమా నంబియార్ హీరోయిన్‌గా చేసింది. హీరో తల్లిగా ...