భారతదేశం, మే 11 -- Comedian Satya: టాలీవుడ్ సెన్సేషనల్ కమెడియన్ సత్య, కోలీవుడ్ కామెడీ కింగ్ యోగి బాబు కలిసి ఒకే సినిమాలో కనిపిస్తే ఎలా ఉంటుంది? ఆ ఊహకే నవ్వు వస్తోంది కదా.. ఇప్పుడు ఇదే కాంబినేషన్ వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమైంది. 'రంగబలి' సినిమాతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పవన్ బాసంశెట్టి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు.

సత్య, యోగి బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సరికొత్త వినోదాత్మక సినిమా సోమవారం (మే 11) అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లో జరిగిన పూజా కార్యక్రమాలతో సినిమాను లాంచ్ చేశారు మేకర్స్.

కేవలం లాంచ్ చేయడమే కాకుండా ఈ రోజు నుంచే రెగ్యులర్ షూటింగ్‌ను కూడా మొదలుపెట్టేయడం విశేషం. కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఈ ఇద్దరు నటులు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తుండటంతో అప్పుడే ట్రేడ్ వర్గా...