భారతదేశం, అక్టోబర్ 2 -- Anil Ravipudi Released Cocoons First Look: టాలీవుడ్‌లో సరికొత్త కథాంశాలతో వచ్చే చిన్న సినిమాలకు, కొత్త నటీనటులకు ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుంది. పెద్ద దర్శకులు, స్టార్ మేకర్ల మద్దతు లభిస్తే ఆ చిత్రాలకు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడుతుంది.

ఈ క్రమంలోనే జగన్ జోగిరాజ్, సాగర్ కిరణ్, వికాస్ చైతన్య, సంగన డుగ్గు, సురభి దీప్తి, దీప్తి పద్మ నిమ్మనగోటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త చిత్రం 'కుకూన్స్' ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

న్యూ వేవ్ పిక్చర్స్, ఎం.ఆర్ట్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సుఖేష్ పొట్ల, మమత రెడ్డి కాసం, మహేశ్ గౌరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈ వేడుకలో పోస్టర్‌న...