భారతదేశం, జూన్ 2 -- Cocktail 2 trailer: బాలీవుడ్ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్న మోస్ట్ లవ్డ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'కాక్‌టెయిల్' (2012) విడుదలై 14 ఏళ్లకు పైనే దాటింది. ఇప్పుడు ఆ మ్యాజిక్‌ను మళ్లీ రిపీట్ చేయడానికి డైరెక్టర్ హోమీ అడజానియా 'కాక్‌టెయిల్ 2' (Cocktail 2) తో మన ముందుకు వస్తున్నారు.

తాజాగా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ యూత్‌ను విపరీతంగా అట్రాక్ట్ చేస్తోంది. షాహిద్ కపూర్, కృతి సనన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ట్రైలర్ ఇంటర్నెట్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

కాక్‌టెయిల్ 2 మూవీ ట్రైలర్ స్టార్టింగ్‌లో హీరో షాహిద్ కపూర్ రిలేషన్‌షిప్స్, లవ్ గురించి చెప్పే ఇంట్రెస్టింగ్ వాయిస్ ఓవర్ మనల్ని వెంటనే స్టోరీలోకి తీసుకెళ్తుంది.

"ఏదైనా బంధం కొత్తగా ఉన్నప్పుడు చాలా ఎక్సైటింగ్‌గా ఉం...