భారతదేశం, సెప్టెంబర్ 20 -- Prakash About CM Vijay Met Ajith In Britain: తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి సి. జోసెఫ్ విజయ్ ఇటీవల చేపట్టిన బ్రిటన్ పర్యటన తమిళనాడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఇంగ్లాండ్‌లోని ప్రసిద్ధ సిల్వర్‌స్టోన్ రేస్ ట్రాక్‌లో జరిగిన 'లే మాన్స్' రేస్‌ను దళపతి విజయ్ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ పోటీలో స్టార్ హీరో అజిత్ కుమార్ తన టీమ్‌తో పాల్గొనగా, విజయ్ ఆయనను ఆప్యాయంగా కౌగిలించుకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే విదేశీ పర్యటనకు వెళ్లడంపై ప్రతిపక్షాలు మండిపడుతుండటంతో, ఈ వివాదంపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తిరుచిరాపల్లిలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ తమిళనాడు సీఎం విజయ్ పర్యటన వివాదంపై మాట్లాడారు. పాలన త...