భారతదేశం, ఆగస్టు 21 -- CM Revanth Reddy US Visit Denied : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. రాజకీయ కారణాలతో ఈ పర్యటనకు క్లియరెన్స్ ఇవ్వలేమని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) తెలిపింది.

ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అక్కడి నుంచి నేరుగా అమెరికాకు వెళ్లేలా ముందస్తు షెడ్యూల్ ఖరారైంది. లండన్ పర్యటన ముగించుకుని ఆగస్టు 30 నాటికి హైదరాబాద్ చేరుకోవాలని ఆయన భావించారు. అయితే కేంద్ర విదేశాంగ శాఖ నుంచి అనుమతి లభించకపోవడంతో. అమెరికాలోని బోస్టన్‌కు వెళ్లాల్సిన సీఎం. తన పర్యటనను రద్దు చేసుకుని ఆగస్టు 23నే లండన్ నుంచి తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు.

అమెరికా పర్యటనలో భాగంగా బోస్టన్, న్యూయార్క్‌లలో పర్యటించి హార్వర్డ్, ఎంఐటీ (MIT), నార్త...