భారతదేశం, మార్చి 5 -- తెలంగాణ రాష్ట్ర అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఐపీఎస్ అధికారుల సంఖ్యను కేటాయించాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి కేంద్ర హోం శాఖ మంత్రితో భేటీ అయ్యారు.

రాష్ట్ర విభ‌జ‌న తర్వాత 2016లో మొద‌టి క్యాడ‌ర్ రివ్యూ జ‌రిగింద‌ని, 2021లో జ‌ర‌గాల్సిన క్యాడ‌ర్ రివ్యూ చాలా ఆల‌స్యంగా 2025లో జ‌రిగింద‌ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఆ స‌మ‌యంలోనూ కేవ‌లం ఏడుగురు ఐపీఎస్ అధికారుల‌ను మాత్రమే తెలంగాణ‌కు కేటాయించార‌ని తెలిపారు.

దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రం సైబ‌ర్ నేరాలు, డ్రగ్స్, వైట్ కాల‌ర్ నేరాలు స‌హా ఇత‌ర అనేక ఆధునిక స‌వాళ్లను ఎదుర్కొంటోంద‌ని రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్, సైబ‌రాబాద్‌, మ‌ల్కాజిగిరి క‌మిష‌న‌రేట్ల పున‌ర్వ్యవస్థీక‌ర‌ణ‌, ఫ్యూచ‌ర్ సిటీ క‌మిష‌న‌ర్, హ...