భారతదేశం, మే 1 -- ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. గడిచిన 22 నెలలుగా ప్రతి గంటను ప్రజల కోసమే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. మేడే సందర్భంగా కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని పమిడిముక్కలలో నిర్వహించిన 'పేదల సేవలో' మరియు మేడే పురస్కారాల అందజేత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ కార్మికులకు, పరిశ్రమల యాజమాన్యాలకు 'శ్రమ శక్తి' పురస్కారాలను అందజేసి వారిని ఘనంగా సత్కరించారు.

సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత రెండేళ్ల కిందటి వరకు భయానక వాతావరణం ఉండేదని గుర్తు చేశారు. "రెండేళ్ల మునుపు మనం ఈ విధంగా సరదాగా నవ్వుకుంటూ కూర్చునే పరిస్థితి లేదు. రాజకీయ నాయకులు కూడా బయట తిరగలేని దుస్థితి ఉండేది. ప్రజలందరికీ మరో స్వాతంత్య్రం తీసుకొచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిది"...