భారతదేశం, జూన్ 10 -- Chiranjeevi On Bharathiraja: భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఒక గొప్ప కథకుడిని, గ్రామీణ మార్కు సినిమాల సృజనశీలిని కోల్పోయింది. లెజెండరీ దర్శకులు భారతీరాజా కన్నుమూశారు. ఆయన మరణం కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌కు తీరని లోటుగా మారింది. ఈ దిగ్గజ దర్శకుడి మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.

పల్లెటూరి మట్టి సువాసనలను వెండితెరపై ఆవిష్కరించి, సామాన్యుల జీవితాలను కావ్యాలుగా మలిచిన దర్శకుడు భారతీరాజా అని చిరంజీవి ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఈ 'ఇయక్కునర్ ఇమయం' (దర్శక శిఖరం) మృతి పట్ల మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.

భారతీరాజా దర్శకత్వంలో చిరంజీవి 'ఆరాధన' సినిమా చేశారు. ఇందులో పులిరాజు క్యారెక్టర్ ప్లే చేశారు మెగాస్టార్. భారతీరాజా మరణించిన వేళ ఆ సినిమాను చిరంజీవి గుర్తు చేసుకున్నారు.

"ఆరాధన సిన...